Teachers Dress Code: విద్యార్థులకే కాదు టీచర్లకు కూడా యూనిఫాం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటే..

విద్యా శాఖ జారీ చేసిన కొత్త ఆదేశం ప్రకారం టీచర్లు, ప్రిన్సిపాల్స్ అధికారిక డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది.

Teachers Dress Code: విద్యార్థులకే కాదు టీచర్లకు కూడా యూనిఫాం.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటే..

Updated On : July 1, 2025 / 4:48 PM IST

Teachers Dress Code: స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు యూనిఫాం ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ స్కూల్ అయినా విద్యార్థులకు డ్రెస్ కోడ్ ఉంటుంది. యాజమాన్యం చెప్పిన యూనిఫామ్ లోనే పిల్లలు స్కూల్ కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, టీచర్లకు మాత్రం ఎలాంటి యూనిఫామ్ ఉండదు. వారికి నచ్చిన డ్రెస్ వేసుకునే వీలు ఉంటుంది. చండీగడ్ లో మాత్రం ఇకపై అలా కుదరదు. అక్కడి ప్రభుత్వం పిల్లలకు పాఠాలు చెప్పే గురువులకు కూడా డ్రెస్ కోడ్ పెట్టింది. అయితే ఈ నిబంధన కేవలం ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే టీచర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రతి వారం ఫార్మల్ డ్రెస్ కోడ్ ఉంటుంది.

విద్యా శాఖ జారీ చేసిన కొత్త ఆదేశం ప్రకారం వచ్చే సోమవారం నుండి చండీగఢ్ ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు, ప్రిన్సిపాల్స్ ప్రతి వారం అధికారిక డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి చొరవ భారతదేశంలో ఇదే మొదటిది. బోధనా సిబ్బందిలో వృత్తి నైపుణ్యం, విజువల్ ఐడెంటిటీ, ఏకరూపతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.

Also Read: ప్రాణాలను పణంగా పెట్టి.. రైల్వే ట్రాక్ పై బైక్స్ పోనిస్తున్న జనం.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే..

అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపబడిన అధికారిక సర్క్యులర్‌లో ప్రతి సోమవారం పురుష, మహిళా ఉపాధ్యాయులకు వేర్వేరు దుస్తుల మార్గదర్శకాలు ఉన్నాయి.

డ్రెస్ కోడ్ మార్గదర్శకాలు..
* పురుష ఉపాధ్యాయులు బూడిద(గ్రే) రంగు ప్యాంటుతో కూడిన నీలిరంగు(బ్లూ) ఫార్మల్ చొక్కాలు ధరించాలి.

* మహిళా ఉపాధ్యాయులు లేత గోధుమ రంగు చీరలు లేదా మెరూన్ బార్డర్లు కలిగిన సల్వార్-కమీజ్ ధరించాలి.

* పురుష ప్రధానోపాధ్యాయులు బూడిద(గ్రే) రంగు ప్యాంటుతో కూడిన తెల్లటి చొక్కాలు ధరించాలి.

* మహిళా ప్రధానోపాధ్యాయులు లేత గోధుమ రంగు చీరలు లేదా బంగారు రంగు బార్డర్లు కలిగిన సల్వార్-కమీజ్ ధరించాలి.

పాఠశాలల్లో సమిష్టి వృత్తిపరమైన గుర్తింపు, క్రమశిక్షణా వాతావరణాన్ని పెంపొందించడమే డ్రెస్ కోడ్ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. వచ్చే సోమవారం నుండి, మినహాయింపు లేకుండా సిబ్బంది మొత్తం డ్రెస్ కోడ్‌ను పాటించేలా చూసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించింది.