కరోనా డ్యూటీ తప్పలేదు పాపం: పాప పుట్టినా గేట్ దగ్గరే నిల్చొని చూసుకున్న ఆఫీసర్

ఫీల్డ్ ఆఫీసర్ రాజీవ్ రాయ్ కు పాప పుట్టింది. ఎత్తుకోవడం కాదు కదా.. ముట్టుకోవడానికి కూడా లేదు. కారణం ఆయన కరోనా డ్యూటీలో ఉండటమే. ఆ టాస్క్ ఇచ్చినప్పటి నుంచి అంటే దాదాపు మూడు వారాల నుంచి గర్భిణీ భార్యకు 8ఏళ్ల కూతురికి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్న గెస్ట్ రూంలోనే గడుపూతూ విధులు నిర్వహిస్తున్నాడు. రాయ్ పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 58కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏమో మహమ్మారి మనలో ఉన్నా లక్షణాలు ముదిరి బయటపడ్డాక కానీ, తెలియదు. ఈ గ్యాప్ లో కుటుంబంలో ఎవరికైనా సోకితే ప్రమాదమని తనకు తానుగా ఫ్యామిలీకి దూరంగా గడుపుతున్నాడు. సోమవారం భార్య ప్రసవం జరిగిందని తెలిసి చిన్నారిని చూడటానికి వచ్చి డాక్టర్ సూచన మేరకు గది తలుపు దగ్గరే ఉండి చూశాడు. సాయంత్రం వరకూ గేట్ వద్దనే నిల్చొని ఇంటికి వెళ్లిపోయాడు.
నా జీవితంలో ఇవొక అద్భుత క్షణాలు. వారిద్దరూ మరి కొద్ది రోజులు హాస్పిటళ్లోనే ఉండాలి. వారు ఉన్న పొజిషన్లో ఇన్ఫెక్షన్లు త్వరగా సోకుతాయి. వాళ్లకు దగ్గరగా ఉండాలి ఇంకా ప్రమాద స్థాయిని పెంచదలచుకోలేదు. నా కూతురిని ఎత్తుకోవాలని ఉంది కానీ, ఎత్తుకున్న వారిలో నన్ను చూసుకుంటున్నా. డ్యూటీ ప్రకారం.. తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది. లేదంటే ఇక్కడే ఉండిపోయేవాణ్ని.
జీవితం ఒక నెలరోజుల్లో మారిపోయింది. రాయ్ అతని భార్య ఆఫీసు పని పక్కకు పెట్టి డెలివరీ సమయంలో సెలవు తీసుకోవాలనుకున్నాడట. ‘రెండు రోజుల ముందు ఆయన ఆఫీసు పని పూర్తి చేసుకుని వారం రోజులు లీవ్ పెట్టుకుంటానని చెప్పారు. ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చే సరికి అంతా బిజీ అయిపోయాం. ఆ తర్వాత నుంచి రాత్రి 2గంటలకు రావడం త్వరగా తినేసి వెళ్లిపోవడం. ఇదే నడిచింది.
ఆయన అన్ని పనుల్లో సాయం చేసేవారు. కానీ, పూర్తిగా ఆయన స్వతహాగా నిర్భందించుకున్నారు. ఎప్పుడూ లేనంత దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఏ ప్రదేశంలో తిరిగాడో.. అవన్నీ మాకు ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతాయోనని భయపడేవాడు. ప్రస్తుతం వేరే గదిలో ఉంటున్నాడు. ఇంటికి రాగానే స్నానం చేసి తిని అక్కడే పడుకునేవాడు. కొద్ది నెలలుగా ఇంట్లో కొత్త ఫ్యామిలీ మెంబర్ ఉన్నట్లుగానే ఉంటున్నాడని రాయ్ భార్య.. చెప్పారు.
ఆదివారం వరకూ రాయ్ అడ్మినిస్ట్రేషన్ టీంతో కలిసి 72గంటల పాటు నోయిడా ప్రాంతంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే డ్యూటీలోనే ఉన్నాడు. ప్రజలు హోం క్వారంటైన్ ను ఉల్లంఘించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం భార్య ప్రసవం వార్త వినగానే వచ్చి చూసుకుని వెళ్లిపోయాడు.
Also Read | అబే యోగేశ్వర్ నీ తండ్రి ఎవరో నీ తల్లిని అడుగు : అల్కా లంబా ఫైర్