Eagle Snatches Hall Ticket : పక్షి ఎంత పని చేసిందిరా అయ్యా.. ఎగ్జామ్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిన డేగ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఆ అభ్యర్థి బిత్తరపోయాడు. హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయలేనని కంగారుపడ్డాడు.

Eagle Snatches Hall Ticket : పక్షి ఎంత పని చేసిందిరా అయ్యా.. ఎగ్జామ్ హాల్ టికెట్ ఎత్తుకెళ్లిన డేగ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

Updated On : April 10, 2025 / 7:57 PM IST

Eagle Snatches Hall Ticket : కేరళలో ఓ పక్షి కలకలం రేపింది. అది చేసిన పని అందరినీ కంగారు పెట్టించింది. సరిగ్గా ఎగ్జామ్ కి ముందు.. డేగ.. ఓ అభ్యర్థి హాల్ టికెట్ ను ఎత్తుకెళ్లింది. దాంతో అభ్యర్థి సహా అందరూ కంగారుపడిపోయారు. హాల్ టికెట్ ను పక్షి ఎత్తుకెళ్లడంతో ఆ అభ్యర్థి టెన్షన్ పడ్డాడు. తాను ఎగ్జామ్ రాయలేమోనని ఆందోళన చెందాడు. ఇంతలో అద్భుతమే జరిగింది. సరిగ్గా లాస్ట్ బెల్ కొట్టే సమయానికి హాల్ టికెట్ ను డేగ వదిలేసింది. దాంతో ఆ అభ్యర్థి ఆనందానికి అవధులు లేవు. వెంటనే హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ హాల్ లోకి సమయానికి చేరుకున్నాడు.

కేరళ రాష్ట్రం కాసర్ ఘడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓ గవర్నమెంట్ స్కూల్ లో ఎగ్జామ్ సెంటర్ పెట్టారు. పరీక్ష రాసేందుకు అభ్యర్థులు సెంటర్ కు చేరుకున్నారు. ఓ అభ్యర్థి తన హాల్ టికెట్ ను తన పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఇంకా సమయం ఉండటంతో అతడు ఎగ్జామ్ సెంటర్ బయటే నిరీక్షిస్తున్నాడు.

ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, సడెన్ గా డేగ వచ్చింది. అభ్యర్థి తన పక్కన పెట్టుకున్న హాల్ టికెట్ ను ముక్కున కరుచుకుని గాల్లోకి ఎగిరిపోయింది. ఊహించని విధంగా జరిగిన ఘటనతో ఆ అభ్యర్థి బిత్తరపోయాడు. హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాయలేనని కంగారుపడ్డాడు.

హాల్ టికెట్ ను ఎత్తుకెళ్లిన డేగ.. ఎగ్జామ్ సెంటర్ బిల్డింగ్ పైన ఉన్న ఓ కిటికీ పైన వాలింది. ఇది గమనించిన ఇతర అభ్యర్థులు పక్షిని భయపెట్టి హాల్ టికెట్ సంపాదించాలని చూశారు. గట్టిగా కేకలు వేశారు. కొందరు దానిపై రాళ్లు కూడా విసిరారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పక్షి హాల్ టికెట్ ను వదల్లేదు. తన గోర్లతో పట్టి ఉంచింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత పక్షికి పాపం అనిపించిందో మరో కారణమో కానీ.. సడెన్ గా హాల్ టికెట్ ను కిందకు వదిలేసింది.

ఎగ్జామ్ మొదలు పెట్టేందుకు లాస్ట్ బెల్ కొట్టడానికి కాసేపటి ముందు హాల్ టికెట్ ను కిందకు వదిలేసింది. దాంతో ఆ అభ్యర్థి ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతడికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. వెంటనే హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్లాడు. సమయానికి అతడు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లగలిగాడు. దాంతో అభ్యర్థి సహా అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. నిజంగా ఏదో అద్భుతమే జరిగిందని డిస్కస్ చేసుకున్నారు.

కాగా, హాల్ టికెల్ లేకపోతే ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. సమయానికి ఆ పక్షి హాల్ టికెట్ ను వదిలేయడంతో ఆ అభ్యర్థి పరీక్షను రాయగలిగాడు. అభ్యర్థి హాల్ టికెట్ ను డేగ ఎత్తుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.