Corona Virus Effect: కరోనా మహమ్మారితో బాలికల శరీరంలో కీలక మార్పులు.. సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు

సాధారణంగా బాలికలు 13 నుంచి 16ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కరోనా మహమ్మారి తరువాత చాలా మంది బాలికలు ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. ఇందుకు ప్రధాన కారణం.. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్, ఆంక్షలేనని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Corona Virus Effect: కరోనా మహమ్మారితో బాలికల శరీరంలో కీలక మార్పులు.. సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు

menstruation in girls

Updated On : October 20, 2022 / 10:02 AM IST

Corona Virus Effect: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మానవుని జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆహార అలవాట్ల నుంచి ఇతర విషయాల్లో మానవుని జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అనారోగ్య సమస్యలు పెరిగాయి. తాజాగా ఓ సర్వేలో కరోనా మహమ్మారి కారణంగా బాలికల శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పుల విషయంలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా బాలికల్లో ముందస్తు రజస్వల కేసుల సంఖ్య భారీగా పెరిగాయని సర్వేలో తేలింది.

Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

సాధారణంగా బాలికలు 13 నుంచి 16ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కరోనా మహమ్మారి తరువాత చాలా మంది బాలికలు ఎనిమిదేళ్లకే రజస్వల అవుతున్నారని సర్వే ద్వారా వెల్లడైంది. ఈ విషయంపై ఢిల్లీకి చెందిన ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ వైద్యుడు మాట్లాడుతూ.. ఇటీవల తన వద్దకు ఓ అమ్మాయి వచ్చిందని, ఆమె వయస్సు ఎనిమిదేళ్లు మాత్రమేనని తెలిపారు. ఆ వయస్సులోనే పీరియడ్స్ మొదలయ్యాయని తెలిపారు. కరోనాకు ముందు ఇలాంటి (ఎర్లీ ప్యూబర్టీ) కేసులు నెలకు 10వరకు వచ్చేవని, కొవిడ్ -19 తరువాత 30 కేసులు దాటుతున్నాయని తెలిపారు. అయితే ఇలా మనదేశంలోనే కాదు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

Corona Virus : రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా వదలని కరోనా

అయితే, ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షలే. లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇంటినుంచి పిల్లలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వారు ఇంట్లోనే ఎలాంటి ఆటలు ఆడకుండా ఉండటం వల్ల వారిలో జీవక్రియలు (మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. ఎలాంటి శారీరక శ్రమలేకుండా ఉండటంవల్ల మన మెదడు, మన శరీరం ఎత్తును పరిగణలోకి తీసుకోదు. కేవలం బరువును పరిగణలోకి తీసుకుంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, బరువును నియంత్రణలో ఉంచుకొని, కొంత శారీరక శ్రమను పొందితే ముందస్తు రజస్వలను అరికట్టే ఆస్కారం ఉంటుంది.