Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు

ఉత్తరాఖండ్ లోని స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake In Uttarakhand : ఉత్తరాఖండ్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు

Earthquake

Updated On : December 19, 2022 / 9:50 AM IST

Earthquake in Uttarakhand : ఉత్తరాఖండ్ లోని స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరకాశీలో సోమవారం(డిసెంబర్19,2022) అర్ధరాత్రి 1.50 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో నిద్రపోతున్న జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.1గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. ఉత్తరకాశీకి 24 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతుల్లో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు.

Earthquake In Nepal : నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు దుర్మరణం

మరోవైపు నేపాల్ కూడా భూమి కంపించింది. ఆదివారం రాత్రి 10.53 గంటలకు ధాడింగ్ జిల్లాలో
4.5 తీవ్రత భూకంపం వచ్చిందని నేపాల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ పేర్కొంది. కఠండూకి 50 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.