Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు.. ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము నుంచి సజయ్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తు.. ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు

AAP MP Sanjay Singh

Updated On : October 4, 2023 / 11:19 AM IST

AAP MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నార్త్ అవెన్యూలోని సంజయ్ సింగ్ నివాసంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత నడుమ ఈడీ అధికారులు బృందంగా ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా శరత్ చంద్రరెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు అప్రూవర్లుగా మారిన విషయం తెలిసిందే. అప్రూవర్లుగా మారిన వారినుంచి కీలక వివరాలను రాబట్టిన ఈడీ అధికారులు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు.

Read Also : Delhi Liquor Scam : రూ.5కోట్లు లంచం..! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం, ఏకంగా ఈడీ అధికారిపైనే సీబీఐ కేసు

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ దాడులపై ఆప్ జాతీయ అధికార ప్రతినిధి రీనా గుప్తా స్పందించారు. ప్రధాన మంత్రి మోదీ, అదానీ అంశాలపై సంజయ్ సింగ్ నిరంతరం ప్రశ్నలు లేవనెత్తుతున్నందున అతని నివాసంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇంతకుముందు ఏమీ దొరకలేదు, ఈరోజు ఏమీ దొరకదని అన్నారు. నిన్న కొందరు జర్నలిస్టుల నివాసాలపై దాడులు నిర్వహించగా, ఈరోజు సంజయ్ సింగ్ నివాసంలో దాడులు జరిగాయని రీనా గుప్తా అన్నారు.

 

 

ఇదిలాఉంటే.. ఢిల్లీ లిక్కర్ కేసుతో సంబంధమున్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జాము నుంచి సజయ్ ఇంట్లో సోదాలు మొదలు పెట్టింది. మరోవైపు.. కొన్నిరోజుల క్రితమే ఎంపీ సంజయ్ తన నివాసం ఎదుట ఈడీకి స్వాగతం అంటూ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆప్ ట్విటర్ లో షేర్ చేసింది.