Rajya Sabha: రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Parliament
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి ఎంత మంది ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారణకు వచ్చిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు స్పీకర్ తమ్మినేని.
ఏప్రిల్‌లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్ బాబు పదవీ కాలం కూడా ముగియనుంది. ఏప్రిల్ 2వ తేదీన వీరు ముగ్గురు పదవీ విరమణ చేస్తారు. వైసీపీ ఇవాలఏ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ