Electric Scooter : రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక మార్కెట్ లో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన తయారి రంగంలోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

Electric Scooter : రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

Electric Scooter

Updated On : July 6, 2021 / 5:18 PM IST

Electric Scooter : ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఓ వైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇక మార్కెట్ లో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన తయారి రంగంలోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మరో ప్రాజెక్టు రాజస్థాన్ లోని నీమ్రానా ప్రాంతంలో 2023 – 25 నాటికి ప్రారంభించనున్నట్లు వివరించారు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేస్తామని సంస్థ పేర్కొంది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ స్కూటర్ ధర రూ.39,999 నుంచి రూ.60,000 ధరల శ్రేణిలో ఉంటాయని ప్రకటించింది. 2025 నాటికి భారతీయ రోడ్లపై కోటి ఈ-స్కూటర్లను తీసుకురావాలంటున్న కేంద్ర ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారం అందించనునట్లు గుప్తా తెలిపారు. అందరికి అందుబాటులో ఉండేలా షో రూమ్స్ ఏర్పాటు చేస్తామనిఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తెలిపారు.