ఈఎస్ఐ పరిమితి 21వేలకు పెంపు: ఉద్యోగులకు వైద్య సౌకర్యం

ఢిల్లీ : ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నఈఎస్ఐ పరిమితి 15 వేల రూపాయల నుంచి 21 వేలకు పెంచారు. ఇప్పటి వరకు 15 వేల రూపాయల లోపు నెలజీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే లభించే ఈఎస్ఐ వైద్య సేవలు ఇక నుంచి 21 వేల రూపాయల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా పొందవచ్చు.