గొంతు కోసినా జై బంగ్లా అంటా : మమత మేనల్లుడు

గొంతు కోసినా జై బంగ్లా అంటా : మమత మేనల్లుడు

Updated On : February 13, 2021 / 7:30 PM IST

Abhishek Banerjee త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. నేతల ఆరోపణలు-ప్రత్యారోపణలతో బెంగాల్ రాజకీయం వేడెక్కింది. తాజాగా బీజేపీ వాళ్లను బయటి వ్యక్తులు(OUTSIDERS)అంటూ మరోసారి ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు,టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ.

దక్షిణ కోల్ కతాలో శనివారం(ఫిబ్రవరి-13,2021)నిర్వహించిన ఓ ర్యాలీలో అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ..ఓట్లను కొనవచ్చు అని బీజేపీ అనుకుంటోంది. ప్రజలు వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీకే వేయాలి. వాళ్ల సంప్రదాయాన్ని మన మీద బలవంతంగా రుద్దాలని చూస్తోన్న బయటివ్యక్తులను(బీజేపీ) తరిమికొట్టే పోరాటం ఇదని అభిషేక్ అన్నారు. తన గొంతు కోసినా కూడా.. జై బంగ్లా,జై మమతా బెనర్జీ అనే తాను అంటానని అభిషేక్ పేర్కొన్నారు. ఏదిఏమైనా ఢిల్లీ ముందు మమతా బెనర్జీ తల దించదని తెలిపారు.

కాగా,శుక్రవారం టీఎంసీ నేత,రాజ్యసభ ఎంపీ దినేష్ త్రివేది పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అబిషేక్ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంలో తాను ఉక్కరిబిక్కిరి అయ్యానని,ఒక అసహాకుడిగా మిగిలిపోయానని త్రివేది ఆరోపించిన విషయం తెలిసిందే. వెస్ట్ బెంగాల్ లో హింస నెలకొని ఉందని..అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న హింస విషయంలో తాను ఏమీ చేయలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నానని రాజ్యసభలో త్రివేది ప్రకటించారు. బెంగాల్ ప్రజలకు తాను సేవ చేయడం కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. అయితే త్రివేది బీజేపీలో చేరుతాని సమాచారం. ఇవాళ ఉదయం బీజేపీ నేత రాజిద్ బెనర్జీ మాట్లాడుతూ..త్రివేది బీజేపీలో చేరతాడన్న సమాచారం తనకుందన్నారు.