Amit Shah: డ్రగ్స్ స్మగ్లర్లకు డెడ్ లైన్ పెట్టిన అమిత్ షా.. ఆ తర్వాత ఇక ఎవరూ మిగలరట
తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 97,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ హాయంలో, అంటే 2006 నుంచి 2013 మధ్య 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం తన ప్రచారాన్ని ఉదృతంగా ముందుకు తీసుకుపోతుందని షా చెప్పారు

Every drug trafficker will be behind bars within.. says Amit Shah
Amit Shah: దేశంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) సరఫరాపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర ప్రకటన చేసింది. డ్రగ్స్ స్మగ్లర్లకు తాము రెండేళ్ల డెడ్ లైన్ ఇస్తున్నామని, ఆ లోపు దేశంలోని స్మగ్లర్లంతా కటకటాల వెనుక ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంటులో ప్రకటించారు. ఈ విషయంలో రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు సహకరించాలని ఆయన కోరారు. దేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం సమస్యపై లోక్‌సభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు అమిత్ షా సమాధానమిస్తూ ‘‘డ్రగ్స్ పట్ల మోడీ ప్రభుత్వం ఏమాత్రం సహనంగా లేదు. డ్రగ్స్ వ్యాపారులను కటకటాల వెనక్కి నెట్టివేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇది ఎంత పెద్ద వ్యవహారమైనప్పటికీ, రాబోయే రెండేళ్లలో డ్రగ్స్ స్మగర్లంతా జైలు గోడల వెనుక ఉంటారు’’ అని అన్నారు.
Durbari Kutte: ‘సోనియా గాంధీ కుక్కలు’.. ఖర్గే ‘కుక్క’ వ్యాఖ్యలపై వివాదాస్పదంగా స్పందించిన బీజేపీ నేత
ఈ వ్యాపారం ద్వారా వచ్చే లాభాలను ఉగ్రవాద చర్యలకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా వినియోగిస్తున్నందున మాదకద్రవ్యాల సమస్య చాలా తీవ్రమైనదని అమిత్ షా అన్నారు. డ్రగ్స్ వ్యాపారులందరినీ జైలుకు పంపేందుకు ఇప్పటికే మ్యాప్ సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వచ్చిన మురికి డబ్బు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నాశనం అవుతుందని అన్నారు. మాదకద్రవ్యాల రహిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో ప్రభుత్వం ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టదని ఆయన స్పష్టం చేశారు.
Rajasthan: రెండు చిత్రాలు, ఒకే ప్రశ్న.. గెహ్లాట్, పైలట్లను రాహుల్ ఏకం చేయగలరా?
ఇక తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, అంటే 2014 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 97,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ హాయంలో, అంటే 2006 నుంచి 2013 మధ్య 23,000 కోట్ల రూపాయల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం తన ప్రచారాన్ని ఉదృతంగా ముందుకు తీసుకుపోతుందని షా చెప్పారు. గుజరాత్‌లో 3,000 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు అద్దం పడుతుందని కొనియాడారు.
డ్రగ్స్ మూలాల్ని కొన్ని గల్ఫ్ దేశాల్లో గుర్తించామని, అక్కడి ఫ్యాక్టరీలు మూతపడేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కేసులు నమోదు చేసేందుకు సరిహద్దు రక్షక దళాలకు ఇచ్చిన అధికారాల గురించి హోంమంత్రి ప్రస్తావిస్తూ, రాజకీయ సమస్యలను సృష్టించే వారు మాదకద్రవ్యాల వ్యాపారానికి మద్దతుదారులని అన్నారు.