వీడియో సాక్ష్యంతో బీజేపీ చిన్మయానంద స్వామికి చెక్!

కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది.

వీడియో సాక్ష్యంతో బీజేపీ చిన్మయానంద స్వామికి చెక్!

Updated On : September 11, 2019 / 10:58 AM IST

కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది.

బీజేపీ సీనియర్ లీడర్ చిన్మయానంద స్వామి రేప్ ఆరోపణలు బలపరిచేలా సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తనపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ వీడియో సాక్ష్యాన్ని బయటపెట్టంది. పెన్ డ్రైవ్‌లో దానికి సంబంధించిన వీడియో ఒకటుందని పోలీసులకు అందజేసింది. 15గంటలపాటు మహిళను విచారణ జరిపిన సుప్రీం కోర్టు అపాయింట్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు అందజేశారు. 

సంవత్సరం పాటు తనపై అత్యాచారం జరిపిన సమయంలో కేంద్ర మాజీ మంత్రిని కళ్లజోడులోని కెమెరాతో రికార్డు చేసింది. వాజ్‌పేయి గవర్నమెంట్‌లో చిన్మయానంద్ మంత్రిగా బీజేపీలో పనిచేశారు. అప్పట్లో తనను రేప్ చేసి వీడియోలతో బ్లాక్ మెయిల్ కూడా చేశారని 23ఏళ్ల మహిళ ఆరోపించింది. 

చిన్మయానంద్‌కు చెందిన లా కాలేజ్‌లో మహిళకు లైబ్రరీలో ఉద్యోగం ఇప్పించారు. ఆ తర్వాత హాస్టల్‌లో ఉండాలని సూచించడంతో మహిళ అక్కడ జాయిన్ అయింది. ఆ తర్వాత మహిళ స్నానం చేస్తున్న వీడియోను రికార్డు చేసి దాంతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారని ఆమె తెలిపింది. అదే తరహాలో తాను సమాధానం చెప్పాలనే ఉద్దేశ్యంతో తన కళ్లజోడులో ఓ కెమెరాను ఏర్పాటు చేసుకుని దాని సహాయంతో వీడియో రికార్డు చేసింది. 

ఫేస్‌బుక్‌లో నేత పేరు చెప్పకుండా ఆరోపణలు చేసిన తర్వాత వారం రోజుల పాటు కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. రాజస్థాన్ లో కనిపించిన మహిళ సుప్రీం కోర్టు ముందు సాక్ష్యాలతో పాటు ఫిర్యాదు ఉంచడంతో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు.