ఓటు వేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

మాజీ ప్రధాని, జేడీఎస్ నేత HD దేవెగౌడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హస్సన్ లోని పడువాల హిప్పే పోలింగ్ కేంద్రంలో భార్యతో కలిసి వచ్చి దేవెగౌడ ఓటు వేశారు. అలాగే బీహార్ లోని భగల్ పూర్ లోని బక్సర్ లో పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఓటు వేశారు. అస్సాం సిట్టింగ్ ఎంపీ సిల్చార్ పార్టీ అభ్యర్థి సుస్మితా దేవ్ తల్లీ, సోదరితో కలిసి వచ్చి ఓటు వేశారు.
ఈ క్రమంలో అమ్మ మక్కల్ మునేత్ర కజకం(ఎమ్మెమ్మెమ్ కే) అధినేత టీటీవీ దినకరన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దక్షిణ చెన్నై నియోజకవర్గం పరిధిలోని బీసెంట్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.కాగా వ్యాప్తంగా 95 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఇవాళ రెండవ దశ పోలింగ్ కొనసాగుతోంది. కర్నాటక మంత్రి హెచ్‌డీ రేవన్నా.. హసన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖులు పిలుపినిచ్చారు.