పాలిటిక్స్ కు గుడ్ బై…శశికళ సంచలన ప్రకటన

పాలిటిక్స్ కు గుడ్ బై…శశికళ సంచలన ప్రకటన

Updated On : March 3, 2021 / 10:02 PM IST

VK Sasikala ఎన్నికల పోలింగ్ తేదీ సమిపిస్తున్న సమయంలో తమిళనాట ఊహించని ఘటన చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బృహిష్కృత నాయకురాలు శశికళ బుధవారం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగుతునట్టు ఆమె ప్రకటించారు.

తనకు ఏనాడు అధికారంపై మోజు లేదని శశికళ ప్రకటించారు. ఏప్రిల్-6న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలన తమిళనాడు రాష్ట్రంలో రాకుండా అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

కాగా, అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరు పరప్పన జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఆకస్మికంగా ఆమె పాలిటిక్స్ ను తప్పుకొంటున్నట్లు ప్రకటించడం వెనుక ఏం జరిగిందనేది తెలియాల్పి ఉంది. అయితే ఎన్నికల ముందు శశికల నిర్ణయం సంచలం కలిగిస్తోంది.