Explosion in Rohini Court : ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు

ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

Explosion in Rohini Court : ఢిల్లీ రోహిణి కోర్టులో పేలుడు

Explosion In Rohini Court

Updated On : December 9, 2021 / 1:36 PM IST

Explosion in Rohini Court : ఢిల్లీలోని రోహిణి కోర్టులో గురువారం చిన్నపాటి పేలుడు జరిగింది.. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ల్యాప్‌టాప్ బ్యాటరీ వలన పేలుడు జరిగే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా వేసినప్పటికీ, పేలుడుకు అసలు కారణం టిఫిన్ బాంబు అని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటన కోర్టు రూమ్ నంబర్ 102లో జరిగింది. ల్యాప్‌టాప్ కాలిన స్థితిలో నేలపై ఉండటంతో అదే పేలిందని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు అధికారులు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

చదవండి : Farmers In Delhi : తగ్గేదే లే.. కేసులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్న రైతులు

ఇక ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు రోహిణి బార్ అసోసియేషన్ ధ్రువీకరించింది. బ్యాగ్‌లో ఉంచిన ల్యాప్‌టాప్ బ్యాటరీ పనిచేయకపోవడం వల్లనే ఈ పేలుడు జరిగి ఉంటుందని ోఅనుమానిస్తున్నారు. అయితే బ్యాగ్‌లో టిఫిన్‌ బాంబు ఉన్నట్లు సమాచారం. పేలుడు ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బృందం కోర్టుకు చేరుకుంది. ఫోరెన్సిక్, క్రైమ్ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించాయి. పేలుడుపై యాంటీ-టెర్రర్ యూనిట్‌లోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ “BDS, FSL నిపుణులు దీనిని పరిశీలించే వరకు నిర్ధారించలేమని తెలిపారు.

చదవండి : Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు