కేరళకు గుడ్‌ బై.. బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్‌-35బీ ఫైటర్ జెట్ ఇక ఎగిరిపోనుంది.. 

ఎఫ్‌-35బీ ఫైటర్ జెట్ జూన్ 14న యూకే నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్న సమయంలో మధ్యలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది. దీంతో అది కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.

కేరళకు గుడ్‌ బై.. బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్‌-35బీ ఫైటర్ జెట్ ఇక ఎగిరిపోనుంది.. 

Updated On : July 21, 2025 / 2:35 PM IST

బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్‌-35బీ ఫైటర్ జెట్ అయిదు వారాలుగా తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్న విషయం తెలిసిందే. అది మంగళవారం అక్కడి నుంచి వెళ్లనుది. హైడ్రాలిక్ సిస్టమ్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసిన తర్వాత ఈ మేరకు తుది అనుమతి ఇచ్చారు.

ఎఫ్‌-35బీ ఫైటర్ జెట్ జూన్ 14న యూకే నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తున్న సమయంలో మధ్యలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయింది. దీంతో అది కేరళలోని త్రివేండ్రం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది.

ఇంధనం తక్కువగా ఉండటం, వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల పైలట్ అత్యవసరంగా అందుబాటులో ఉన్న సమీప విమానాశ్రయాన్ని ఎంచుకున్నాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించి సాయం అందించింది.

Also Read: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌ రావు నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్‌

గత 5 వారాల్లో జెట్‌ను తిరిగి పంపించేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. ఈ 5వ తరం స్టెల్త్ ఫైటర్ యూకేకు చెందిన హెచ్‌ఎంఎస్‌ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో భాగంగా ఉంది. ఇది ప్రస్తుతం ఇండో, పసిఫిక్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇటీవల భారత నౌకాదళంతో కలసి సముద్రంలో సంయుక్త విన్యాసాలు పూర్తిచేసింది.

జూలై 6న ఫైటర్ జెట్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ సమస్యలు, హైడ్రాలిక్ లోపాన్ని సరిచేసే పనులు ప్రారంభించారు. యూకే నుంచి 24 మందితో కూడిన బృందం, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 14 మంది టెక్నికల్ నిపుణులు, 10 మంది క్రూ మెంబర్లు కేరళకు వచ్చి ఫైటర్ జెట్ మరమ్మతు చేశారు.