సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. ఎలక్షన్ రిజల్ట్స్ పేరుతో మోసాలు
Fact Check: బ్యాంకు ఖాతా నుంచి, యూపీఐ పేమెంట్స్ వరకు అన్ని సైబర్ నేరగాళ్లు చేతుల్లో ఉంటాయి.

దేశం మొత్తం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఎలక్షన్ రిజల్ట్స్ పేరుతో యాప్ సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. పలు గ్రూపుల్లో ఫేక్ ఎలక్షన్ రిజల్ట్స్ యాప్ వైరల్ అవుతోంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు మీ ఫోన్లో ఉన్న సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.
బ్యాంకు ఖాతా నుంచి, యూపీఐ పేమెంట్స్ వరకు అన్ని సైబర్ నేరగాళ్లు చేతుల్లో ఉంటాయి. మీ బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది. ఇటువంటి ఫేక్ యాప్స్ నమ్మొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అటువంటి యాప్స్ ను డౌన్లోడ్ చేయొద్దని అంటున్నారు. ట్రెండుకు తగ్గట్లుగా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.