కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళ్తే.. లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేల డబ్బు దోచేశారు

కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళ్తే.. లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేల డబ్బు దోచేశారు

Updated On : July 20, 2020 / 6:13 PM IST

కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళితే లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేలు డబ్బు దోచుకుపోయారు. పైగా అది కంటోన్మెంట్ జోన్ అని బోర్డు తగిలించడంతో అటుగా పాట్రోలింగ్ వాహనం కూడా రౌండ్స్ కు రాలేదు. కోల్‌కతాలోని ఓ ఫ్యామిలీలోని వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. కొంతకాలం తర్వాత కుటుంబమంతా అనారోగ్యానికి గురైంది.

రిపీటెడ్ గా జ్వరం వస్తుండటంతో కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకున్నారు. వారిలో కొందరికీ పాజిటివ్ రావడంతో కుటుంబంలో నలుగురు వ్యక్తులను హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచారు. దొంగబాబులకు అదే సరైన సమయమనిపించింది. కరోనా మహమ్మారి వల్ల ప్రాణానికే ప్రమాదమని కూడా లెక్కచేయకుండా దొంగతనానికి పాల్పడ్డారు.

ఆ సమయంలో ఓ మహిళ, చిన్న పిల్లాడితో నిద్రపోతుంది. ఆమెకు తెలియకుండా ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారంతో పాటు డబ్బులు దోచుకుపోయారు. కంటైన్మెంట్ జోన్ బయట పోలీసులు ఉండి లోపలి ప్రాంతంలో పాట్రోలింగ్ జరగకపోవడంతో దొంగల పని ఈజీ అయిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.