’ఫోని‘ ఎఫెక్ట్ : టూరిస్ట్ లు వెళ్లిపోమ్మంటున్న ఒడిశా ప్రభుత్వం

ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టింది. మే 2 నుంచి స్కూల్స్, కాలేజెస్ మూసివేయాలని ఆదేశించింది. అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన పూరీలోని యాత్రికులంతా గురువారం సాయంత్రానికల్లా నగరం విడిచి వెళ్లిపోవాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది.
Also Read : పెను తుఫాన్ గా ఫోని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు
మరోవైపు సహాయక చర్యలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికల సంఘం ఇప్పటికే ఒడిశాలోని 11 జిల్లాల్లో కోడ్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఒడిశా తీరప్రాంతంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3న మధ్యాహ్నం ఒడిశాలోని పారాదీప్ సమీపంలో తుపాను తీరం దాటనున్నట్టు వాతావరణశాఖ ప్రకటించింది. కాగా ఫోని తుఫాను హెచ్చరికలతో ముందుస్తు జాగ్రత్తలతో NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నౌకాదళం, తీరప్రాంత రక్షణ దళం, విపత్తు నిర్వాహణ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Also Read : ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు