Viral Video: 12వ అంతస్థు నుంచి వేలాడుతూ ఎక్సర్‌సైజ్.. వీడి ఫిట్‌నెస్ తగలెయ్యా
కొద్ది రోజుల ముందే ఇదే ఫరీదాబాద్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. 9వ అంతస్థులో పడిపోయిన దుస్తులు తీసేందుకు 10వ అంతస్థు నుంచి పిల్లాడికి చీర కట్టి కిందకు దించి తర్వాత పైకి లాగింది.

12th Floor
Viral Video: దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. కానీ, వీడెవడండి బాబూ. 12 అంతస్థు నుంచి పడిపోతామనే భయం కూడా లేకుండా ఎక్సర్‌సైజ్ అంటూ ఫీట్స్ చేస్తున్నాడు. మల్టీ స్టోర్ బిల్డింగ్ పై నుంచి గ్రిల్ పట్టుకుని అటువైపుకు దిగాడు. దానిని పట్టుకుని సిట్ అప్స్ చేసి కాసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లిపోయాడు.
కొద్ది రోజుల ముందే ఇదే ఫరీదాబాద్ లో మరో షాకింగ్ ఘటన జరిగింది. 9వ అంతస్థులో పడిపోయిన దుస్తులు తీసేందుకు 10వ అంతస్థు నుంచి పిల్లాడికి చీర కట్టి కిందకు దించి తర్వాత పైకి లాగింది. రెండు వీడియోలను ఎదురు అపార్ట్‌మెంట్లో ఉండే వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి.