Farm bills : రాష్ట్రపతి భవన్ వద్ద ట్రాక్టర్‌కు నిప్పుపెట్టి రైతుల ఆందోళన

Farm bills (వ్యవసాయ బిల్లు)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ వింగ్ సోమవారం.. ట్రాక్టర్ ను తగులబెట్టి ఆందోళన చేపట్టారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే రాజ్‌పథ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ‘మన దేశ దొంగలే రైతుల రక్తం, చెమటను దోచుకుంటున్నారు. దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతన్నను బ్రిటిష్ వారి నుంచి అందరూ దోచుకుంటూనే ఉన్నారు. మన రైతులే దేశానికి వెన్నెముక.
స్వతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెత్ యూత్ విభాగం ట్రాక్టర్ కు నిప్పు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాం’ అని యూత్ కాంగ్రెస్ విభాగం ట్వీట్ చేసింది.
ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు–2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు–2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు–2020.లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మూడు బిల్లులను ఆమోదించారు. ప్రధాని మోడీ దిష్టి బొమ్మను సైతం కాలబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్‌సర్-ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు.
ఈ చట్టలనేవి క్యాన్సర్, స్లో పాయిజన్ లా రైతుల్ని చంపేసి, వ్యవసాయాన్ని మట్టుబెడతాయి. ఈ చట్టాల్ని వ్యతిరేకించడానికి మద్ధతు తెలపండి. వ్యాపారస్థులకు బానిసలుగా రైతుల్ని తయారుచేస్తారంటూ కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. ఈ విషయంలో ఎన్‌డీఏను వీడి బయటకు రావాలని జేడీయూ, ఎల్‌జేపీ, జేజేపీ పార్టీలను కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆదివారం లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ రాష్ట్రంలో వివిధ రైతు సంఘాలు, వివిధ సంఘాలు సోమవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చాయి.