జిల్లాల వారీగా లాక్‌డౌన్ తొలగించిన పంజాబ్

కరోనావైరస్ నుంచి పంజాబ్ రైతులకు తాత్కాలిక విముక్తి కల్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా రైతులకు లాక్ డౌన్ నుంచి ఉపశమనం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కోతకు వచ్చిన 185 లక్షల టన్నుల గోధుమ పంట పాడవకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పని పరిస్థితుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
రైతులు కూడా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలి. కొవిడ్ 19కేసులు తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరువకూడదు. ఇప్పటి వరకూ పంజాబ్ లో 132కేసులు నమోదుకాగా, 11మంది కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
‘ఇది పంట దిగుబడుల సమయం. ఏప్రిల్ 14వరకూ లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏప్రిల్ 15నుంచి గోధుమ పంట కోతలు మొదలవుతాయి. భారీ స్థాయిలో పంట చేతికి రావాల్సి ఉంది. దీనికి చాలా సమయమే పట్టింది. టెస్టులు జరుగుతున్నంత కాలం.. కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. 132కేసులకు 11మంది ప్రాణాలు కోల్పోయారు. 2877మందికి టెస్టులు నిర్వహించాం’ అని పంజాబ్ సీఎం అననారు.
పూర్తి స్థాయి లాక్ డౌన్ కు వెళ్లిన రెండో రాష్ట్రం పంజాబ్. కేరళ తర్వాత కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పంజాబ్ ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది.