Farmers Protest : రైతు ఉద్యమంలో మరణించిన శుభకరన్ సింగ్ పోస్ట్‌మార్టం నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు

శుభకరన్ సింగ్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్ మార్టం నివేదికలో తుపాకీ గాయం కారణంగా అతను

Farmers Protest : రైతు ఉద్యమంలో మరణించిన శుభకరన్ సింగ్ పోస్ట్‌మార్టం నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు

Shubh Karan Singh

Shubh Karan Singh Postmortem Report : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మరింత ఉధృతమైంది. డిమాండ్ల సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని రైతులు తమ ట్రాక్టర్లు, ట్రాలీలు, మినీ వ్యాన్ లతో ఫిబ్రవరి 13 నుంచి సరిహద్దు పాయింట్ల వద్ద బారులు తీరారు. అయితే, ఖనౌరీ సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులకు, హర్యానా భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో శుభకరన్ సింగ్ నే రైతు మరణించిన విషయం తెలిసిందే. శుభకరన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు తొలుత రైతు సంఘాలు, కుటుంబ సభ్యులు నిరాకరించారు. అతని మరణానికి కారణమైన పోలీస్ సిబ్బందిపై హత్యకేసు నమోదు చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనికితోడు అతని అమరవీరుడు హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read : Farmers Protest : పంజాబ్ – హర్యానా సరిహద్దుల్లో 12వ రోజుకు చేరిన రైతు ఉద్యమం.. పెరుగుతున్నమరణాలు

రైతుల డిమాండ్ తో పంజాబ్ పోలీసుల పై హత్యకేసు నమోదు చేశారు. అనంతరం శుభకరన్ సింగ్ పోస్టుమార్టంకు రైతులు అంగీరించారు. శుభకరన్ సింగ్ పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందుస్థాన్ టైమ్స్ సమాచారం ప్రకారం.. పోస్ట్ మార్టం నివేదికలో తుపాకీ గాయం కారణంగా అతను మరణించాడని తేలింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ నివేదికను పాటియాలా పోలీసులకు సమర్పించారు.. తదుపరి వివరాలు చెప్పడానికి నిరాకరించారు. ఇదిలాఉంటే.. గురువారం పంజాబ్ లోని భటిండా జిల్లాలోని అతని స్వగ్రామమైన బల్లోహ్ లో శుభకరన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు.