COVID-19; కొవిడ్ తగ్గించుకోవాలని కిరోసిన్ తాగేశాడు – రిపోర్టులో నెగెటివ్

జ్వరం వచ్చిన వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో సొంత వైద్యం చేసుకున్నాడు. ఎవరో చెప్పిన దానిని నమ్మి అదే అపోహతో కొవిడ్ కు కిరోసిన్ మందు అనుకున్నాడు.

COVID-19; కొవిడ్ తగ్గించుకోవాలని కిరోసిన్ తాగేశాడు – రిపోర్టులో నెగెటివ్

Kerosene Covid 19

Updated On : May 17, 2021 / 9:18 PM IST

COVID-19; జ్వరం వచ్చిన వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో సొంత వైద్యం చేసుకున్నాడు. ఎవరో చెప్పిన దానిని నమ్మి అదే అపోహతో కొవిడ్ కు కిరోసిన్ మందు అనుకున్నాడు. కిరోసిన్ తాగితే కొవిడ్ నుంచి బయటపడొచ్చని నమ్మి తాగేశాడు. ఆ తర్వాత అతనికి కొవిడ్ టెస్టు నెగెటివ్ రిజల్ట్ వచ్చింది.

వృత్తి రీత్యా టైలర్ గా పనిచేస్తున్న మహేంద్రా(30) భోపాల్ లోని శివ్ నగర్ లో ఉంటున్నాడు. దాదాపు ఐదారు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. మందులు వేసుకుంటున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గడం లేదు. కొవిడ్-19 అనే అనుమానం పెంచుకున్నాడు. ఎవరో ఒక వ్యక్తి కిరోసిన్ కరోనావైరస్ ను చంపేస్తుందన్న మాట గుర్తొచ్చింది.

బుధవారం రాత్రి 9గంటల సమయంలో కిరోసిన్ తాగేశాడు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ కు తరలించారు. అధికారులు బెడ్ అందుబాటులో లేదని చేర్పించుకునేందుకు నిరాకరించగా మరో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చికిత్స కోసం హాస్పిటల్ మార్చినా ఉపయోగం లేకుండాపోయింది. శనివారం అతను చనిపోయినట్లు డాక్టర్లు డిక్లేర్ చేశారు.

అతని శాంపుల్స్ ను కొవిడ్ టెస్టుకు పంపించగా నెగెటివ్ వచ్చిందని పోలీస్ అధికారులు చెబుతున్నారు.