Corona Vaccination: దేశంలో 50కోట్ల మందికి వ్యాక్సినేషన్.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

దేశంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 50 కోట్లు దాటింది. శుక్రవారం 43.29 లక్షల డోస్‌లు ఇవ్వడంతో, దేశంలో 50,03,48,866 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Corona Vaccination: దేశంలో 50కోట్ల మందికి వ్యాక్సినేషన్.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

Vaccine

Updated On : August 7, 2021 / 6:41 AM IST

Vaccination: దేశంలో కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్నవారి సంఖ్య 50 కోట్లు దాటింది. శుక్రవారం 43.29 లక్షల డోస్‌లు ఇవ్వడంతో, దేశంలో 50,03,48,866 డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18-44 మధ్య వయస్సు గల 18.35కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీనిపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

“కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం ఒక కొత్త మైలురాయిని చేరుకుంది. 50 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును భారత్ దాటింది. ఈ సంఖ్యను ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు, ‘టికా ఫర్ ఆల్, ఫ్రీ వ్యాక్సిన్’ కార్యక్రమం కింద #SabkoVaccineMuftVaccine పేరిట అవగాహన పెంచి, వ్యాక్సినేషన్ జరపాలని నిర్ణియించాం” అని మోడీ చెప్పారు.

హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయమై ట్వీట్ చేస్తూ, “మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ సాగిందని, 50 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించినట్లుగా చెప్పారు. ఇంత పెద్ద దేశంలో, ఇంత తక్కువ సమయంలో ఇంత విస్తృతంగా వ్యాక్సిన్ వేయడం ప్రతి దేశ పౌరుల ప్రాణాలను కాపాడడం పట్ల మోదీ జీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది” అని అన్నారు.

మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో 18-44 సంవత్సరాల వయస్సులో ఒక కోటి కంటే ఎక్కువ డోసుల వ్యాక్సినేషన్ ఇవ్వబడినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. తాత్కాలిక నివేదిక ప్రకారం, వ్యాక్సిన్ ప్రచారంలో 203వ రోజు (ఆగస్టు 6) మొత్తం 43,29,673 డోసులు ఇవ్వబడ్డాయి. వీరిలో 32,10,613 మందికి మొదటి డోస్ ఇవ్వగా, 11,19,060 మందికి రెండో డోస్ ఇచ్చారు.