Viral Video : షాకింగ్.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడకం ఎంత డేంజరో చూడండి, వెన్నులో వణుకు పుట్టించే వీడియో

Viral Video : బంకు సిబ్బంది కానీ ధైర్యం చేసి మంటలు ఆర్పివేయకపోయుంటే ఊహించని రీతిలో ఘోర ప్రమాదమే జరిగేదన్నారు పోలీసులు.

Viral Video : షాకింగ్.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడకం ఎంత డేంజరో చూడండి, వెన్నులో వణుకు పుట్టించే వీడియో

Viral Video (Photo : Google)

Viral Video – Petrol Pump : పెట్రోల్ బంకులో వాహనదారులు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులో ప్రధానమైనది సెల్ ఫోన్ వాడకూడదు అనేది ఒకటి. పెట్రోల్ పోయించుకునేందుకు బంకులోకి వెళ్లే వాహనదారులు ఎవరు కూడా సెల్ ఫోన్ ఉపయోగించకూడదనే విషయం అందరికీ తెలిసిందే.

ఎందుకంటే సెల్ ఫోన్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఫోన్ వాడొద్దని సిబ్బంది మరీ మరీ చెబుతారు. అయితే, కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఘోర ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫోన్ వినియోగం కారణంగా పెట్రోల్ పంప్ స్టేషన్ లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.

Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

తాజాగా మహారాష్ట్ర నాగ్ పూర్ లోని ఓ పెట్రోల్ బంకులో ఘోరం జరిగింది. ఓ వాహనదారుడు పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చాడు. సిబ్బంది అతడి బైక్ లో పెట్రోల్ పడుతున్నాడు. ఇంతలో బైక్ యజమానికి ఫోన్ రింగ్ అయ్యింది. ఆ వ్యక్తి మరో ఆలోచన లేకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు. అంతే, ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ మంటలు చెలరేగాయి. భయంతో వాహనదారులు, పెట్రోల్ బంకు సిబ్బంది అక్కడి నుంచి దూరంగా పరుగు తీశారు. అయితే, బంకు సిబ్బంది కాస్త ధైర్యం చేసి మంటలను ఆర్పివేశారు.

దాంతో అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదం ఒళ్లుగగుర్పొడిచే రీతిలో ఉందని నెటిజన్లు అంటున్నారు. బంకు సిబ్బంది కానీ ధైర్యం చేసి మంటలు ఆర్పివేయకపోయుంటే ఊహించని రీతిలో ఘోర ప్రమాదమే జరిగేదన్నారు పోలీసులు. అందుకే, పెట్రోల్ బంకుల్లో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఫోన్ ఉపయోగించకూడదని నెటిజన్లు అంటున్నారు.