4 రోజుల్లో 3వ సారి : జామియా వర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు

ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు చేసుకున్నాయి. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. విద్యార్థులపై కాల్పులు జరిపారని.. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని విద్యార్థులు వివరించారు. కాల్పులకు నిరసనగా జామియా నగర్ పోలీస్ స్టేషన్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన విరమించారు.
రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు చేశారు. అయితే అక్కడ తమకు ఎలాంటి బుల్లెట్ షెల్స్ దొరకలేదని పోలీసులు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో కాల్పులపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు కాల్పులు జరిగింది నిజమా కాదా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరిగి ఉంటే.. బుల్లెట్ షెల్స్ దొరికి ఉండేవి కదా అని పోలీసులు అంటున్నారు. అంతేకాదు.. కాల్పుల గురించి విద్యార్థులు.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతున్నారని చెప్పారు. దుండగులు స్కూటర్ మీద వచ్చారని కొందరు చెబితే.. ఫోర్ వీలర్ లో వచ్చారని మరికొందరు చెప్పారు. దీంతో పోలీసుల్లో అనుమనాలు పెరిగాయి.
స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకడు రెడ్ జాకెట్ వేసుకు ని ఉన్నాడని, కాల్పులు జరిపింది అతడే అని విద్యార్థులు తెలిపారు. సీఏఏకి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ దగ్గర 2 నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనకారులు అక్కడ టెంట్ వేశారు. శనివారం(ఫిబ్రవరి 01,2020) జామియా వర్సిటీ దగ్గర కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. కొన్ని రోజుల క్రితం షాహీన్ బాగ్ దగ్గర ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఏఏకు(CAA) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో జామియా దగ్గర నాలుగు రోజుల వ్యవధిలో కాల్పులు జరగడం ఇది మూడో సారి. షాహీన్ బాగ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓ వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఉద్యమాలు చేస్తున్నాయి.
Also Read : నాకు కరోనా లేదు..తీసుకెళ్లండి..కర్నూలు యువతి సెల్ఫీ వీడియో