India-Taliban Meeting : భారత్-తాలిబన్ మధ్య తొలి దౌత్య సమావేశం..కీలక అంశాలపై చర్చ

అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం

India-Taliban Meeting : భారత్-తాలిబన్ మధ్య తొలి దౌత్య సమావేశం..కీలక అంశాలపై చర్చ

It

Updated On : August 31, 2021 / 6:36 PM IST

India-Taliban Diplomatic Meeting    అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్..మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుకి సిద్ధమవుతున్న వేళ..తొలిసారిగా ఖతార్ రాజధాని దోహలో మంగళవారం భారత్-తాలిబన్ మధ్య దౌత్యపరమైన సమావేశం జరిగింది.

ఖతార్ లోని భారత రాయబారి దీపక్ మిట్టల్..దోహలోని తాలిబన్ రాజకీయ కార్యాలయం హెడ్ గా ఉన్న షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తో సమావేశమై చర్చలు జరిపారు. ఖతార్ లోని ఇండియన్ ఎంబసీలో ఈ మీటింగ్ జరిగిందని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  తాలిబన్ విజ్ఖప్తి మేరకే ఈ మీటింగ్ జరిగినట్లు తెలిపింది. అప్ఘానిస్తాన్ లో ఇంకా చిక్కుకుపోయిన భారత పౌరుల సేఫ్టీ,భద్రత మరియు వేగవంతమైన తరలింపు గురించి ప్రముఖంగా ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రకటనలో విదేశాంగశాఖ పేర్కొంది. అదేవిధంగా, భారతదేశానికి వెళ్లానుకునే అప్ఘాన్ జాతీయులు ముఖ్యంగా మైనారిటీల గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అప్ఘాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక కార్యకాలాపాలకు మరియు ఉగ్రవాదం కోసం ఏ విధంగానూ ఉపయోగించరాదని భారత రాయబారి మిట్టల్ ఈ సమావేశంలో సృష్టం చేయగా..భారత రాయబారి లేవనెత్తిన అంశాలును సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబాన్ ప్రతినిధి రాయబారికి హామీ ఇచ్చారని తెలిపింది.

మరోవైపు, భారత్‌ తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగించాలని అప్ఘానిస్తాన్ కోరుకుంటుందని తాలిబన్ అగ్రనేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ తెలిపారు. కాగా,అఫ్ఘానిస్తాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్ అగ్రనేత ఒకరు భారత్‌ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాలిబన్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో శనివారం పోస్ట్ చేశారు.

46 నిమిషాల నిడివిగల వీడియోలో.. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం ముగిసిందని షేర్ మహమ్మద్ చెప్పారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకి తాలిబన్ ఫ్లాన్ చేస్తుందన్నారు. భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై తాలిబన్ ల అభిప్రాయాల గురించి మాట్లాడుతూ.. భారత్‌తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ఇక, అప్ఘాన్ లోని చాంబహార్ పోర్టుని భారత్ అభివృద్ధి చేసిన విషయాన్నిషేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ గుర్తు చేశారు.

ఈ ఉపఖండంలో భారత దేశం చాలా ముఖ్యమైన దేశమని షేర్ మహమ్మద్ అన్నారు. గతంలో మాదిరిగానే అన్ని రకాల సంబంధాలను భారత్ తో కొనసాగిస్తామన్నారు. పాకిస్తాన్ గుండా భారతదేశం నుంచి వాణిజ్యం జరగడం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. భారత్ తో.. గగనతలం గుండా వాణిజ్యం కూడా ఎప్పటిలాగే తేరిచే ఉంటుందన్నారు. అయితే, భారతదేశం గుండా వాణిజ్యం రెండు విధాలుగా ఉంటుందని ఆయన చెప్పలేదు. పాకిస్తాన్.. తమ భూభాగం ద్వారా అఫ్ఘాన్ వ్యాపారులు తమ వస్తువులను భారతదేశానికి రవాణా చేయడానికి అనుమతించింది.. కానీ పాకిస్తాన్ భూభాగం ద్వారా అఫ్ఘానిస్తాన్‌కు భారత్ వస్తువులను రవాణా చేయడానికి ఎన్నడూ అనుమతించలేదు.

READ Mohammad Abbas: భారత మిలిట్రీఅకాడ‌మీలో ట్రైనింగ్ పొందిన అఫ్ఘన్‌ తాలిబన్‌ అగ్రనేత

READAfghanistan Crisis :హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసిన మోదీ