UP Elections : యూపీలో తొలి విడత 11 జిల్లాల్లో ప్రారంభమైన పోలింగ్..
యూపీలో తొలి విడత 11 జిల్లాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రారంభమైంది. 58 నియోజక వర్గాల్లో ఉదయమే ప్రారంభమైన పోలింగ్ కు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.

Elections In Uttar Pradesh
First phase elections in Uttar pradesh started : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు ఉదయం తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో మొదటి విడతగా 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఈ మొదటి విడతలో మొత్తం 628 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. యూపీలో మరోసారి అధికారంలోకి రావటానికి బీజేపీ, పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈక్రమంలో బీఎస్పీ తన ఉనికి నిలుపుకోవటానికి యత్నాలు చేస్తోంది. ఈ తొలివిడత పోలింగ్ లో భాంగా 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Also read : Hizab :హిజాబ్ వివాదంపై పాక్ విమర్శలు..మా సమస్యను మేం చూస్కుంటాం..మీరు నీతులు చెప్పక్కర్లా
మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ…ఎలాగైనా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని సమాజ్‌వాదీ పార్టీ పట్టుదలగా ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా ఏమాత్రం తగ్గేదే లేదంటోంది. ఎక్కువగా స్థానాలకు గెలుచుకుని పట్టు నిలుపుకోవటానికి కాంగ్రెస్ పోరాడుతోంది. అలాగే ఒకప్పుడు అధికారంలోకి వచ్చి పలు వివాదాలకు కేంద్రంగా మారిన బీఎస్పీ ఉనికి కాపాడుకోవడానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి తన యత్నాలు తాను చేస్తున్నారు.
Also read : Parliament Session : మోదీపై టీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కాగా సంవత్సరానికిపైగా రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ చేసిన రైతు ఉద్యమం ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అలాగే ఈ ప్రభావంతో తమకు లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఆశిస్తున్నాయి. కాగా సంవత్సారానికి పైగా రైతులు..ఇళ్లు వదిలి..వ్యవసాయాలు వదిలి పోరాటం చేశారు.ఈక్రమంలో ఏడాదిపైగా జరిగిన ఉద్యమాన్ని పట్టించుకోని కేంద్రం ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలోనే సాగుచట్టాలను రద్దు చేసిందని ఇది రాజకీయ లబ్ది కోసమేనని విపక్షాలు విమర్శలుచేశాయి. ఆ ఉద్యమమే తమకు లాభిస్తుందని ఆశిస్తున్నాయి ప్రతిపక్షాలు.
Also read : Sumanth : రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఇదే చూస్తున్నాం.. పవన్, జగన్ పై మాట్లాడిన సుమంత్..
షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పట్, మీరఠ్, ఘజియాబాద్, హాపుడ్, గౌతమబుద్ధనగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో జాట్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉండడంతో తొలి విడత ఎన్నికల్లో వీరి ఓట్లు కీలక పాత్ర పోషించనున్నాయి. 2017 ఎన్నికల్లో పశ్చిమ యూపీలోని 58 సీట్లకు గాను బీజేపీ 33 స్థానాలను కైవసం చేసుకుంది. మరి ఈసారి ఇక్కడ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందోనని విషయం ఆసక్తికరంగా మారింది.