భారీ ఎన్‌కౌంటర్…ఐదుగురు మావోయిస్టులు హతం

Five Naxals killed in gunbattle మహారాష్ట్రలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా కొసమి-కిసనెల్లి అటవీప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
ఇవాళ మధ్యాహ్నాం ధనోకా తాలుకా ప్రాంతంలో సీ60 కమాండో ఫొర్సెస్ కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొసమి-కిసనెల్లి అడవి మధ్యలో మావోయిస్టులు తారాసపడడంతో పరస్పరం కాల్పులకు దిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరికొంతమంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు.