Flipkart Responds: ఐఫోన్‌ 13 ఆర్డర్లు క్యాన్సిల్.. కస్టమర్ల ఆగ్రహం.. ఫ్లిప్‌కార్ట్‌ ఏం చెప్పిందంటే

ఐఫోన్‌ 13 బుక్ చేసుకున్న కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్‌ షాకిచ్చింది. తమ ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ మెసేజెస్ పంపింది. దీంతో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది.

Flipkart Responds: ఐఫోన్‌ 13 ఆర్డర్లు క్యాన్సిల్.. కస్టమర్ల ఆగ్రహం.. ఫ్లిప్‌కార్ట్‌ ఏం చెప్పిందంటే

Updated On : September 27, 2022 / 1:30 PM IST

Flipkart Responds: గత ఏడాది విడుదలైన ఐఫోన్ 13కు ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. కొత్తగా మార్కెట్లోకి ఐఫోన్ 14 వచ్చినా సరే చాలా మంది ఐఫోన్ 13 కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్.. ఐఫోన్ 13ను డిస్కౌంట్‌లో తక్కువ ధరకే అందిస్తామని ప్రకటించింది.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఐఫోన్ 13 తక్కువ ధరకే వస్తోంది. దాదాపు రూ.48 వేలకే ఈ ఫోన్ సేల్‌లో ఉంచింది. తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది కస్టమర్లు ఐఫోన్ 13 బుక్ చేసుకున్నారు. తొందర్లోనే ఐఫోన్ 13 తమ చేతికొస్తుందని ఆశపడ్డ కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ షాకిచ్చింది. చాలా మంది కస్టమర్లకు ఐఫోన్ 13 ఆర్డర్లు క్యాన్సిల్ అయినట్లు మెసేజెస్ వచ్చాయి. అది కూడా ఆర్డర్ బుక్ చేసి, పే చేసిన తర్వాత. దీంతో కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ బుక్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత క్యాన్సిల్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

ఫ్లిప్‌కార్ట్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఫ్లిప్‌కార్ట్‌ స్పందించింది. ‘‘ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పుడూ కస్టమర్ల అభిప్రాయాల్ని గౌరవిస్తుంది. ఇప్పటికే ఐఫోన్ ఆర్డర్లకు సంబంధించి 70 శాతం ఫోన్లను డెలివరీ చేశాం. గుంటూరు, గోరఖ్ పూర్, సిలిగురి వంటి అనేక నగరాల్లో ఫోన్లు డెలివరీ చేశాం. కానీ, విక్రయదారుల అసహజ నిర్ణయాల వల్ల తక్కువ శాతంలో ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యాయి’’ అని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.