బడ్జెట్ 2021-22 : ఎర్రటివస్త్రంతో చుట్టిన ట్యాబ్ తో నిర్మలమ్మ

బడ్జెట్ 2021-22 : ఎర్రటివస్త్రంతో చుట్టిన ట్యాబ్ తో నిర్మలమ్మ

Updated On : February 1, 2021 / 10:48 AM IST

FM Nirmala Sitharaman : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్రకటన చేశారామె. ఉదయం 10 గంటల 15 పార్లమెంట్‌లోనే కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో 2021-2022 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ తొలి ప్రతిని అందించారు.

ఈసారి వినూత్నంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా కారణంగా…ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ లో అందించనున్నారు. సూట్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ ప్రతులను తీసుకువచ్చే విధానానికి స్వస్తి చెప్పి.. ఎరుపురంగు వస్త్రంలో బహీఖాతా రూపంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా..బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఐ ప్యాడ్ తో పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు మంత్రి నిర్మల.

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజల అంచనాలకు తగ్గట్టే బడ్జెట్ ఉంటుందని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అన్న సూత్రాన్ని పాటించామని, కరోనా మహమ్మారి నుంచి అన్ని రంగాలు కోలుకునేలా బడ్జెట్ ఉంటుందని వెల్లడించారు.

దేశంలో భారీ ఎత్తున వినియోగాన్ని ప్రోత్సహించేలా.. ప్రజల చేతుల్లో నగదు ఎక్కువ ఉండేలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ను పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను భారంలో 50 వేల నుంచి 80 వేల వరకూ రాయితీ కల్పించే అవకాశాలున్నాయని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను లక్ష వరకు పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను విధించే ఆదాయం పరిధి పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టు ఆశిస్తున్నారు.