Manipur Violence: మణిపూర్ హింస వెనుక విదేశీ శక్తులు .. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కీలక వ్యాఖ్యలు
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గలవారు తమ పనిని మెరుగ్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అని నరవాణే చెప్పారు.

Manipur Violence
Former Army Chief General Naravane : మణిపూర్ హింసాకాండలో విదేశీ ఏజెన్సీల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో అస్థిరత దేశం మొత్తం జాతీయ భద్రతకు మంచిది కాదని ఆయన చెప్పారు. మణిపూర్ హింసలో వివిధ తిరుగుబాటు గ్రూపులకు చైనీస్ సహాయం పొందడం అనే వాస్తవాన్ని కూడా ఆర్మీ మాజీ చీఫ్ నొక్కి చెప్పాడు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ సెక్యూరిటీ పెర్స్పెక్టివ్ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మణిపూర్ హింసకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
Manipur Violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గలవారు తమ పనిని మెరుగ్గా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అని నరవాణే చెప్పారు. అయితే, మణిపూర్ హింసలో విదేశీ సంస్థ హస్తాన్ని కొట్టిపారేయలేమని, వివిధ తీవ్రవాద సంస్థలకు చైనా నుండి సహాయం అందుతుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుందని నరవాణే అన్నారు. ఈశాన్య రాష్ట్రంలో కొనసాగుతున్న హింసలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పాత్రపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలాకాలంగా జరుగుతోందని అన్నారు. రికవరీ చేయబడిన డ్రగ్స్ పరిమాణం గత కొన్నేళ్లుగా పెరిగిందని చెప్పారు. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ సరిహద్దు కలిపే ప్రాంతంకు కొద్దిదూరంలోనే ఉన్నాం. మయన్మార్ లో ఎప్పుడూ గందరగోళం, సైనిక పాలన ఉంది. మయన్మార్ యొక్క ఉత్తమ కాలంలో కూడా, మధ్య మయన్మార్ లో ప్రభుత్వ నియంత్రణ మాత్రమే ఉంది. సరిహద్దు దేశాల్లో భారతదేశం, చైనా, థాయ్ లాండ్ తో సంబంధం లేకుండా ప్రభుత్వ నియంత్రణ చాలా తక్కువగా ఉంది. అందుకే డ్రగ్స్ అక్రమ రవాణ ఎప్పటి నుంచో ఉందని అన్నారు.
మణిపూర్లో సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే, విదేశీ శక్తులు హింసను మరింత ప్రేరేపించేలా చేస్తున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫలితంగా నిరంతరాయంగా హింసను తగ్గించేలా ప్రయత్నాలు జరుగుతున్నా అక్కడ జరుగుతున్న హింసాకాండ ఆగపోవడానికి కారణం ఇదేనని అన్నారు. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని నేను నమ్ముతున్నానని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే అన్నారు.