Caste Census: కేంద్రం చేపట్టనున్న ‘కుల గణన’పై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక కామెంట్స్..

కేంద్రం ‘కుల గణన’ నిర్ణయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు.

Caste Census: కేంద్రం చేపట్టనున్న ‘కుల గణన’పై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక కామెంట్స్..

Former CJI NV Ramana

Updated On : May 2, 2025 / 10:48 AM IST

Caste Census: దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతోపాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. తాజాగా.. కేంద్రం ‘కుల గణన’ నిర్ణయంపై మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక కామెంట్స్ చేశారు.

Also Read: మోదీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. దేశ వ్యాప్తంగా కులగణన..

సాధారణ జనాభా లెక్కలతోపాటు కుల గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ స్వాగతిస్తూ అభినందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని అభిప్రాయపడ్డారు. కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవమన్న ఆయన.. చాలాకాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

Also Read: Amit Shah: మోదీ సర్కార్ ఎవరినీ వదలదు, వెంటాడి వెంటాడి అంతం చేస్తుంది- అమిత్ షా

కులాన్ని గుర్తింపుగా తీసుకొని జనగణన చేయాలనే నిర్ణయం సరైన దిశలో సరైన అడుగు అని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి సువిశాలమైన, వైవిధ్యభరితమైన దేశంలో ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్రకోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదని అన్నారు. కుల గణన ద్వారా సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంతోపాటు.. సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, అభివృద్ధిలో సరైన వాటాను అందించడంలో సహాయపడుతుందని తాను విశ్వసిస్తున్నానని ఎన్వీ రమణ అన్నారు. జనాభా గణనలో ప్రతి సామాజిక సూచికను పరిగణలోకి తీసుకోవాలని, తద్వారా ఇది సామూహిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సమగ్ర వినియోగ ప్రక్రియగా మారాలని ఎన్వీ రమణ ఆకాంక్షించారు.