ఆర్థికవేత్త ఆగయా : రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ ఇవాళ(ఆగస్టు-23,2019) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్ తో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ తో పాటు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మన్మోహన్ సింగ్.. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 1991- 2019 మధ్య దాదాపు 3 దశాబ్దాలు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఈ సారి అసోం నుంచి అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ నుంచి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దాదాపు మూడు దశాబ్దాలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ 2004- 14 మధ్య రెండు సార్లు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ ఏడాది జూన్ 14తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం ముగిసింది. అసోం నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్‌కు సరిపడా బలం లేకపోవడంతో.. ఈ దఫా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. గతేడాది జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నిక్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Delhi: Former Prime Minister & Congress leader Dr. Manmohan Singh takes oath as Rajya Sabha member from Rajasthan. pic.twitter.com/Wpt9KCzHyT
— ANI (@ANI) August 23, 2019