Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఇకలేరు

Parkash Singh Badal: ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గతంలో రాజకీయంగా ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ఇకలేరు

Parkash Singh Badal

Updated On : April 25, 2023 / 9:44 PM IST

Parkash Singh Badal: పంజాబ్ (Punjab) మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ (Parkash Singh Badal) ఇకలేరు. అనారోగ్యంతో బాధపడిన ఆయన మొహాలీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. ప్రకాశ్ సింగ్ బాదల్ వయసు 95. శ్వాస కోస సమస్యలతో బాధపడుతూ ఆయన కొన్ని రోజుల క్రితం ఫోర్టీస్ ఆసుపత్రిలో ఏప్రిల్ 21న ఆయన చేరారు.

ఐసీయూలో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పరిస్థితి విషమించి ఇవాళ కన్నుమూశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాశ్ సింగ్ బాదల్ మొత్తం నాలుగు సార్లు పనిచేశారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా 1970-1971, 1977-1980, 1997-2002, 2007-2017 మధ్య పనిచేశారు. 1970లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అప్పట్లో దేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నిలిచారు. శిరోమణి అకాలీదల్ పార్టీకి 1995 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.

ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. గతంలో రాజకీయంగా ఆయనతో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Mobile Phone Explodes : బాబోయ్.. బాంబులా పేలిన సెల్‌ఫోన్, 8ఏళ్ల చిన్నారి మృతి