తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్‌ పాండియన్ కన్నుమూత 

  • Published By: veegamteam ,Published On : January 4, 2020 / 06:37 AM IST
తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ పీహెచ్‌ పాండియన్ కన్నుమూత 

Updated On : January 4, 2020 / 6:37 AM IST

తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్.. అన్నాడీఎంకే నాయకులు పీహెచ్‌ పాండియన్‌ తన 74ఏట  కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాండియన్‌ తమిళనాడులోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జనవరి 4,2020) ఉదయం 8:30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పాండియన్‌ మృతిపట్ల అన్నాడీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఎంజీ రామచంద్రన్‌ సీఎంగా ఉన్న సమయంలో 1985 నుంచి 1987 మధ్యకాలంలో అసెంబ్లీ స్పీకర్‌గా పాండియన్‌ కొనసాగారు. 1999 నుంచి 2004 మధ్య కాలంలో తిరునెల్వేలి ఎంపీగా సేవలందించారు పాండియన్‌.

ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత పాండియన్ ఎఐఎడిఎంకె చేరి ప్రస్తుతం దివంగనేత జయలలితతో చేతులు కలిపారు.  తరువాత 1999 నుంచి 2004 మధ్య పాండియన్ AIADMK తరపున తిరునెల్వేలి MP గా పనిచేశారు.పాండియన్ జయలలితకు చాలా సన్నిహితుడిగా మెలిగారు. ఈ క్రమంలో పాండియన్ కుమారుడు కూడా AIADMK మంచి పదవుల్లో కొనసాగారు.