Punjab : భటిండియా మిలటరీ స్టేషన్‌లో కాల్పులు, ఉగ్ర దాడిగా అనుమానం

భటిండియా మిలటరీ స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Punjab : భటిండియా మిలటరీ స్టేషన్‌లో కాల్పులు, ఉగ్ర దాడిగా అనుమానం

Firing At Punjab Military Station

Updated On : April 12, 2023 / 10:42 AM IST

Punjab పంజాబ్‌ (Punjab)లోని భటిండియా మిలటరీ స్టేషన్ (Bathinda Military Station)లో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈరోజు అంటే బుధవారం (ఏప్రిల్ 12,2023)తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో భటిండియా సైనిక శిబిరంలో (Bathinda Military Station)లో ఆగంతకులు కాల్పులకు తెగబడ్డాయి. ఈకాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడినట్లుగా తెలుస్తోంది.

కాల్పులు శబ్దాలు వినిపించగానే క్విక్ రియాక్షన్ టీమ్స్ అలెర్ట్ అయ్యాయి. స్టేషన్‌లోని ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీంతో ఆగంతకులు అక్కడినుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. వారి కోసం క్విక్ రియాక్షన్ టీమ్స్ గాలిస్తోంది. పశ్చిమ భారత సరిహద్దుల్లో ఉన్న అతి పెద్ద స్టేషన్లలో భటిండియా మిలటరీ స్టేషన్ అతి పెద్దది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ కాల్పులకు తెగబడింది ఉగ్రవాదులా? అనే కోణంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులు జరిపినట్లుగా అధికారులు భావిస్తున్నారు.