భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్..రూ. 24 వేలు దోచుకున్నారు

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 06:48 AM IST
భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్..రూ. 24 వేలు దోచుకున్నారు

Updated On : July 17, 2020 / 9:43 AM IST

కరోనా అందర్నీ అల్లాడిస్తుంటే..కొంతమంది కన్నుమిన్ను లేకుండా ప్రవర్తిస్తున్నారు. దారుణాలకు తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి ముసలి వారిపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు.

తాజాగా భర్త ఎదుటే భార్యపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అనంతరం వారి వద్దనున్న డబ్బును దోచుకపోయారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

బార్వానీ జిల్లాలో 2020, జులై 14వ తేదీ మంగళవారం చోటు చేసుకుందని additional superintendent of police సునీతా రావత్ వెల్లడించారు. దంపతులు బైక్ పై వెళుతున్నారని, కొద్ది దూరం వెళ్లిన తర్వాత..బైక్ ఆపడంతో మహిళ కాలకృత్యం తీర్చుకొనేందుకు వెళ్లిందన్నారు.

కానీ భార్య ఎంత సేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన భర్త..అటవీ ప్రాంతంలోకి వెళ్లాడని, అక్కడ కొంతమంది భార్యపై అఘాయిత్యానికి పాల్పడడం గ్రహించడన్నారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతడిని చెట్టుకు కట్టేసి నలుగురు అత్యాచారం చేశారని వెల్లడించారు.

బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వారి వద్దనున్న రూ. 24 వేలు నిందితులు దోచుకున్నారని వెల్లడించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.

ఖార్గోన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ తిలక్ సింగ్, ఇండోర్ రేంజ్ ఇన్స్ పెక్టర్ జనరల్ వివేక్ శర్మలు గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.