దేశంలో కరోనా విజృంభణ.. వేగంగా పెరుగుతున్న కొత్త కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ..

భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

దేశంలో కరోనా విజృంభణ.. వేగంగా పెరుగుతున్న కొత్త కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ..

Corona Virus

Updated On : June 3, 2025 / 10:12 AM IST

Corona Virus : భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది.

 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4026 కాగా.. 2700 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1416 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, ఢిల్లీ 393, కర్ణాటక 311, గుజరాత్ 397, తమిళనాడులో 215, వెస్ట్ బెంగాల్ 372, ఉత్తరప్రదేశ్ 138, ఆంధ్రప్రదేశ్ 28, తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు కోవిడ్ కారణంగా మరణించగా.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొవిడ్ వైరస్ వల్ల 37మరణించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాయి. కర్నూల్ జిల్లాలోనూ కరోనా కేసు నమోదైంది. ఒకరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్లు గ్రామానికి చెందిన 65ఏళ్ల వృద్ధుడికి పాజిటివ్ గా గుర్తించారు. ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ కేసు నమోదు కావడంతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.