వీడియో‌కాల్‌లో నూడ్‌గా కనిపించేలా రెచ్చగొడుతుంది, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు దోచుకుంటుంది, కొత్త రకం దందా

  • Published By: naveen ,Published On : August 17, 2020 / 12:10 PM IST
వీడియో‌కాల్‌లో నూడ్‌గా కనిపించేలా రెచ్చగొడుతుంది, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు దోచుకుంటుంది, కొత్త రకం దందా

Updated On : August 17, 2020 / 3:43 PM IST

ముంబైలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ కిలాడీ లేడీ తన మాయమాటలతో అడ్డంగా దోచుకుంటోంది. మగాళ్ల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటోంది. ముందుగా సోషల్ మీడియాలో మగాళ్లను పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత చనువుగా మాట్లాడుతుంది. వీడియో కాల్ లో నూడ్ గా కనిపిస్తుంది. అది కూడా కొన్ని సెకన్లే. ఎదుటి వ్యక్తి కూడా నూడ్ గా కనిపించేలా రెచ్చగొడుతుంది. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తుంది. వీడియో కాల్ ఆధారంగా అవతలి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దోచుకుంటుంది. ఇలానే ఓ వ్యక్తి నుంచి రూ.20వేలు దండుకుంది.

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధిత యువకుడు ముంబై ఈస్ట్ గోరెగావ్ లో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. వయసు 21ఏళ్లు. కొన్ని రోజుల క్రితం అతడికి సోషల్ మీడియాలో ఓ మహిళ పరిచయం అయ్యింది. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

ఆ తర్వాత చనువు పెరిగింది. నాతో వీడియో కాల్ లో మాట్లాడతావా అని మహిళ అడిగింది. అందుకు ఆ యువకుడు ఓకే చెప్పాడు. దీంతో వెంటనే ఆమె వీడియో కాల్ చేసింది.

కాగా వీడియో కాల్ లో 3 సెకన్ల పాటు నూడ్ గా కనిపించింది. ఆ వెంటనే కాల్ ఎండ్ చేసింది. ఆ తర్వాత యువకుడితో చాటింగ్ ప్రారంభించింది. నువ్వు కూడా వీడియో కాల్ లో నూడ్ గా కనిపించాలని కోరింది. అతడు సరే అన్నాడు. వెంటనే వీడియో కాల్ చేశాడు. నూడ్ గా కనిపించాడు. దీన్ని ఆ మహిళ రికార్డ్ చేసింది.

కాల్ ఎండ్ చేశాక, ఆ యువకుడికి మహిళ నుంచి ఓ మేసేజ్ వచ్చింది. 20వేలు ఇవ్వకపోతే వీడియో క్లిప్ ని నీ స్నేహితులు, బంధువులకు పంపుతానని బెదిరించింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. ఆ మహిళ మాటలకు భయపడ్డాడు. పరువు పోతుందని భయపడ్డాడు.

వెంటనే మహిళ బ్యాంకు ఖాతాకి రూ.2వేలు పంపాడు. ఆ తర్వాత ఆ మహిళ అన్నంత పని చేసింది. యువకుడి ఫ్రెండ్ కు నూడ్ వీడియో క్లిప్ పంపింది. దీంతో మరింత భయపడ్డ యువకుడు మిగతా అమౌంట్ రూ.18వేలు ఆమె బ్యాంకు ఖాతాకు ట్రాన్సఫర్ చేశాడు. అంతే, అప్పటి నుంచి ఆ యువతి సైలెంట్ అయిపోయింది. కొన్నాళ్లు అతడికి కాల్ చెయ్యలేదు.

కొన్ని రోజుల తర్వాత సడెన్ గా ఆ మహిళ మళ్లీ ఆ యువకుడికి మేసేజ్ పంపింది. మరింత డబ్బు కావాలని డిమాండ్ చేసింది. బూతులు కూడా తిట్టింది. దీంతో ఆ యువకుడు ఆమె నెంబర్ ని బ్లాక్ చేసి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఖాతాలోకి డబ్బు పంపే సమయంలో ఆమె పేరు లాలూ ప్రసాద్ ప్రగ్యా జైన్ గా ఉందని పోలీసులతో చెప్పాడు. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

సోషల్ మీడియా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్లు పెట్టొద్దని సూచిస్తున్నారు. అపరిచితులతో అస్సలు మాట్లాడొద్దని, దూరంగా ఉండాలని పదే పదే చెబుతున్నారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

అయినా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు సోషల్ మీడియా వేదికగా అడ్డంగా మోసపోతున్నారు. కొందరు పరువు, కొందరు డబ్బు పొగొట్టుకుంటున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.