Freedom Fighter Wife: మణిపూర్ లో మరో దారుణం.. స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను ఇంట్లో బంధించి సజీవ దహనం
ఆమె భర్త ఎస్ చురాచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, ఘర్షణలో సెరో గ్రామం నామరూపాల్లేకుండా పోయింది.

S Ibetombi maibi
Freedom Fighter Wife – Manipur : మణిపూర్ లో మరో దారుణ జరిగింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్ర్య సమయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ ఘోరం జరిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బాధిత వృద్ధురాలు సోరోకైబాయ్ ఇబెటోంబికు 80 ఏళ్ల వయసు ఉంటుంది.
ఆమె భర్త ఎస్ చురాచంద్ సింగ్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కాగా, ఘర్షణలో సెరో గ్రామం నామరూపాల్లేకుండా పోయింది. తమ గ్రామంపైకి దాడికి వచ్చిన దుండుగులు ఇబెటోంబిని ఇంట్లో బంధించి, బయట గడియ పెట్టి నిప్పు పెట్టారని ఆమె మనవడు ప్రేమ్ కాంత్ తెలిపారు.
మరోవైపు మే 15వ తేదీన తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొంటూ ఈస్ట్ ఇంఫాల్ కు చెందిన 18 ఏళ్ల యువతి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతమంది మహిళలు తనను నలుగురు సాయుధ వ్యక్తులకు అప్పగించారని పేర్కొన్నారు.