Kishan Reddy Journey : కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి.. అందుకే ఈసారి ప్రమోషన్ ఇచ్చారా?!
భారతీయ జనతా పార్టీ యువనేత జి. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కిషన్ రెడ్డికి దక్కింది. జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది.. స్టూడెంట్ లీడర్ నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగారు.

Kishan Reddy Gets Cabinet Status As Union Cabinet Minister
Kishan Reddy Journey From Youth Worker : భారతీయ జనతా పార్టీ యువనేత జి. కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నుంచి తొలి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి కిషన్ రెడ్డికి దక్కింది. బీజేపీలో అంచెలు అంచెలు ఎదిగిన నేతగా కిషన్ రెడ్డి.. పార్టీ ఆవిర్భావం నుంచే ఉన్నారు. యువమోర్చాలో కీలక పదవులను చేపట్టారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిపొందారు. మోడీ 2.0 మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మోదీ మంత్రివర్గ విస్తరణలో కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కింది. స్వతంత్ర హోదాతో మంత్రి పదవి లభించే ఛాన్స్ ఉందని టాక్.. స్వతంత్ర హోదాతో కార్మికశాఖ ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో బండారు దత్తాత్రేయ ఇదే పదవి చేపట్టారు.. కిషన్ రెడ్డికి కూడా అదే ఇస్తారని విశ్వసనీయ సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిషన్ రెడ్డికి అత్యంత స్నేహితుడు కూడా. అందుకే ఆయనకు ఈ ప్రమోషన్ ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఏ శాఖను కిషన్ రెడ్డికి కట్టబెడతారో చూడాలి.
స్టూడెంట్ లీడర్ నుంచి కేబినెట్ మంత్రిగా :
జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది.. స్టూడెంట్ లీడర్ నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగారు. 1964, మే 15వ తేదీన జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి జన్మించారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన ఆయన టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తిచేశారు. 1995లో కావ్యతో కిషన్ రెడ్డి వివాహం జరిగింది. ఆయనకు ఇద్దరు సంతానం వైష్ణవి, తన్మయ్ ఉన్నారు. రాజకీయ జీవితాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1977లో జనతాపార్టీలో సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక అయ్యారు. తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1980 నుంచి 1994 వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండేవారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2002లో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
2004-19 మధ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో వివాదరహితుడిగా పేరు పొందిన కిషన్ రెడ్డి.. 2019లో సికింద్రాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించారు. హోం శాఖ సహాయ మంత్రిగా కశ్మీర్ వ్యవహారాల పర్యవేక్షించారు.
2009లో అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2012 జనవరి 19న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో బీజేపీ పోరుయాత్ర కొనసాగించారు. తెలంగాణ బీజేపీ నేతల్లో కీలక నేతగా ఎదిగారు. ప్రధాన మంత్రి మోదీకి సన్నిహితుడిగా మెలిగారు. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.