G20 Summit 2023: జీ20 గావెల్‌ను బ్రెజిల్ అధ్యక్షుడికి అందించిన మోదీ 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ ఉదయం..

G20 Summit 2023: జీ20 గావెల్‌ను బ్రెజిల్ అధ్యక్షుడికి అందించిన మోదీ 

G20 Summit 2023

G20 Summit 2023 – New Delhi: జీ20 సదస్సు ముగిసింది. జీ20 అధ్యక్షతను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు అందించారు. న్యూ ఢిల్లీలో జీ20 సదస్సు ముగిసిందని మోదీ అధికారికంగా ప్రకటించారు.

మరోవైపు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాం వెళ్లారు. కాగా, యుక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని జీ20 వేదిక సమస్యగా మార్చకూడదని భారత షెర్పా అమితాబ్ కాంత్ కోరిన విషయం తెలిసిందే.

జీ20 డిక్లరేషన్ కు ఏకాభిప్రాయం రావడం శుభపరిణామం. నరేంద్ర మోదీ జీ20 లోకి ఆఫ్రికా యూనియన్‌ ను స్వాగతిస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆ యూనియన్‌ కు చెందిన 55 సభ్య దేశాలు కూడా సానుకూల స్పందన తెలిపాయి.

G20 Summit 2023: జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు