Gautam Adani : అదానీకి ఈ వారంలో భారీ నష్టం!
ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది.

Gautam Adani Loses Over Rs 97000 Crore This Week
Gautam Adani ఈ ఏడాది శరవేగంగా వృద్ధి చెందిన గౌతమ్ అదానీ సంపద ఈ వారంలో అంతకంటే వేగంగా క్షీణించింది. సోమవారం నుంచి గురువారం నాటికి అదానీ సంపద 97వేలకు కోట్ల రూపాయలకు పైనే తగ్గింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో అధిక వాటాలు కలిగిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)లో మూడింటి డీమాట్ అకౌంట్లను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) స్తంభింప చేసిందంటూ సోమవారం వార్తలు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమవడమే ఇందుకు కారణం.
అయితే,ఆ తర్వాత అదానీ గ్రూప్,అటు స్టాక్ మార్కెట్ ఇవన్నీ అసత్యాలు అంటూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా అదానీ షేర్ల పతనం కొనసాగింది. దీంతో ఆయన ఆసియా కుబేరుల్లో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి జారుకున్నారు. అయితే శుక్రవారం అనూహ్యంగా కొన్ని అదానీ కంపెనీల షేర్లు మళ్లీ తిరిగి పుంజుకున్నాయి. మొత్తంగా ఈ వారం ప్రపంచ కుబేరుల్లో అత్యధికంగా నష్టపోయింది అదానీయే.