సీడీఎస్ గా రావత్…కొత్త యూనిఫామ్ ఎలా ఉందో చూడండి

  • Published By: venkaiahnaidu ,Published On : January 1, 2020 / 12:42 PM IST
సీడీఎస్ గా రావత్…కొత్త యూనిఫామ్ ఎలా ఉందో చూడండి

Updated On : January 1, 2020 / 12:42 PM IST

దేశపు తొలి త్రివిధ దళాధిపతి(సీడీఎస్)గా బిపిన్ రావత్ బుధవారం(జనవరి-1,2020)న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా రావత్ పేరును సోమవారం ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతరం ఆయన ధరించే దుస్తులు,పెట్టుకునే టోపీ,అలంకరించుకునే పతకాలు ఏ విధంగా ఉంటాయన్న ఆశక్తి అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మంగళవారం ADG PI-ఇండియన్ ఆర్మీ సీడీఎస్ ధరించే టోపీ,బటన్స్,బెల్ట్ బకెల్,భుజానికి ధరించే ర్యాంక్ బ్యాడ్జీల ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

భారత్ తోలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా(సీడీఎస్) నియమితులైన జనరల్ బిపిన్ భారత రక్షణ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. 2022 డిసెంబర్‌ వరకు సీడీఎస్ గా రావత్ బాధ్యతలు నిర్వహిస్తారు. సీడీఎస్ గా బాధ్యతలు చేపట్టిన రావత్ ను…ఇంతటి కీలక పదవి చేపట్టంపై మీ అభిప్రాయమేమిటి అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా…తలపై భారం తగ్గిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గత నలభై ఏళ్లుగా తాను ధరించిన గోర్ఖా టోపీని తొలగించి కొత్త క్యాప్ ధరించడంతో తల భారం తగ్గిందన్నారు. ఇప్పుడు తాను పెట్టుకున్న టోపీ సీడీఎస్ అనుసరించబోయే తటస్థ వైఖరిని ప్రతిబింబిస్తోంది. సీడీఎస్ త్రివిధదళాలతో ఓకేరీతిన వ్యవహరిస్తారు. ఈ కారణంతోనే ప్రస్తుతం నా తల భారం తగ్గిందని అన్నట్లు రావత్ తెలిపారు.

త్రివిధ దళాధిపతులను సీడీఎస్ డైరక్ట్ చేస్తాడు .ప్రభుత్వానికి సింగిల్ పాయింట్ సైనిక సలహాదారుగా సిడిఎస్ ఉంటారు.ఆయుధాల కొనుగోలు, శిక్షణ, సిబ్బంది, మిలటరీ కమాండ్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు వంటివి నిర్వర్తిస్తారు. మొత్తంగా త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు కార్యక్రమాలు చీఫ్ ఆఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ నేతృత్వంలోనే జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై ఆయుధాల కొనుగోలు విషయంలో నిధులు దుర్వినియోగం కాకుండా చూసే బాధ్యత కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌పై ఉంటుంది.