Gold Parcel: కొరియర్ పార్శిల్‌లో రూ.1.20 కోట్ల విలువైన బంగారం
దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్ లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ పైన కూరగాయల విత్తనాలు అని రాసిఉంది.

Gold Parcel
Gold Parcel: దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన కార్గో విమానంలోని పార్శిల్ లో రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్ పైన కూరగాయల విత్తనాలు అని రాసిఉంది. బరువు అధికంగా ఉండటంతో అనుమానం వచ్చిన అధికారులు పార్శిల్ ఓపెన్ చేసి చూశారు.
ఇందులో 2.5 కేజీల బంగారం పొడి బయటపడ్డాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కాగా చెన్నై చిరునామాగా ఈ పార్శిల్ వచ్చింది. మొత్తం నాలుగు డబ్బాల్లో బంగారు పొడిని స్వాధీనం చేసుకున్నారు.
బహిరంగ మార్కెట్‌లో ఈ బంగారం విలువ రూ.1.20 కోట్లు వుంటుందని పేర్కొన్న అధికారులు, ఈ పార్శిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయనే విషయమై విచారణ చేపట్టారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు.