Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా!
గడిచిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు, రెండు రెజులు స్వల్పంగా పెరిగాయి. శనివారం బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది\

Gold Price Today
Gold Price Today : గడిచిన ఐదు రోజుల్లో మూడు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు, రెండు రెజులు స్వల్పంగా పెరిగాయి. శనివారం బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరిగి రూ.46,850 చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారంపై కూడా రూ.10 రూపాయలు పెరిగింది. రూ. 49,050 చేరింది. బంగారం ధరల్లో ఈ మార్పు కొనుగోలు దారులపై ఎటువంటి ప్రభావం చూపదని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కూడా ముగుస్తుండటంతో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ నిపుణులు.
చదవండి : Gold Today Rates : బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు పెరిగే అవకాశం
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,110 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,150ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,110 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,810 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,030 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,960 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద కొనసాగుతోంది.