ఫుల్ డిమాండ్ : ప్రధాని మోడీ ఫోటోతో గోల్డ్ రింగులు

వ్యాపారులు తమ అమ్మకాలు పెంచుకునేందుకు ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఆయా సందర్భాలను బట్టి తమ వస్తువులను విక్రయించేందుకు విభిన్నంగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బంగారు రింగ్ లు ఇప్పుడు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేతల ఫోటోలో ఫెక్సీలు కనిపిస్తుంటాయి. కానీ మోడీ స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో మోడీ ఫొటోలు ఉన్న గోల్డ్ రింగ్స్ ని జోరుగా అమ్మేస్తున్నారు గోల్డ్ వ్యాపారులు.
రాజ్‌కోట్‌లోని సోనీబజార్ దేశవ్యాప్తంగా చాలా పేరుంది. ప్రధాని మోదీ ఫోటోలు కలిగిన రింగులను డిజైన్ చేసారు. బీజేపీ గుర్తు అయిన కమలం గుర్తుతో పాటు మోదీ ఫోటో లను డిజైన్ చేసిన ఈ ఉంగరాలకు కొనుగోలుదారుల నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. ఈ ఉంగరాలు గుజరాత్‌లోనే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు 12 రాష్ట్రాల్లో కూడా జోరుగా అమ్ముడవుతున్నాయి. కష్టమర్స్ బడ్జెట్ ను బట్టి గోల్డ్ తోనే కాక వెండితో కూడా ఈ ఉంగరాలను తయారు చేస్తున్నారు.
వీటికి ఎంత డిమాండ్ ఉందంటే.. తయారీదారులు 24 గంటల పాటూ వీటిని తయారు చేయడంలోనే నిమగ్నమైపోయారు. అయినా డిమాండ్ కు తగిన స్టాక్ ను అందించలేకపోతున్నారట. అలాగే మోడీ ఫోటోలతో చీరలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.