డ్రైవర్ లేకుండానే 84 కి.మీ దూసుకుపోయిన రైలు.. చివరికి ఎలా ఆపారో తెలుసా?

ఆ సమయంలో ఆ ట్రాకుపై ఆ ట్రైనుకు ఎదురుగా ఏ ఇతర రైళ్ల షెడ్యూళ్లూ లేవని..

డ్రైవర్ లేకుండానే 84 కి.మీ దూసుకుపోయిన రైలు.. చివరికి ఎలా ఆపారో తెలుసా?

Goods train

డ్రైవర్ లేకుండానే 84 కిలోమీటర్లు దూసుకుపోయిందో ఓ రైలు. జమ్మూకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో గూడ్స్ రైలుని డ్రైవర్ ఆపి, హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. దీంతో అది డ్రైవర్ లేకుండానే వెళ్లి పంజాబ్‌లోని ముకేరియన్ జిల్లాలో ఆగింది.

ఇవాళ ఉదయం 7 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రైలులో కాంక్రీట్‌ ఉందని అధికారుల తెలిపారు. దాన్ని రైల్వేకు సంబంధించిన నిర్మాణాల కోసం వినియోగించాల్సి ఉందని చెప్పారు. పఠాన్‌కోట్ వైపు రైలు పట్టాలు వాలుగా ఉంటాయని, దీని కారణంగానూ రైలు ముందుకు వెళ్లిందని అన్నారు.

ఆ రైలు కదిలిన తర్వాత దాన్ని ఆపడానికి రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేశారని, చివరకు దాసుహాకు సమీపంలో ఉంచి బస్సీ ఏరియా వద్ద దాన్ని ఆపగలిగారని తెలిపారు. డ్రైవర్లు, ప్యాసింజర్ ట్రైన్ల సిబ్బంది సాయంతో దాన్ని ఆపారని చెప్పారు. ఆ సమయంలో ఆ ట్రాకుపై ఆ ట్రైనుకు ఎదురుగా ఏ ఇతర రైళ్ల షెడ్యూళ్లూ లేవని, దీంతో ఏ ప్రమాదమూ జరగలేదని వివరించారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టమూ జరగలేదని అన్నారు.

Viral Video : ఫ్రెండ్ కోలా చనిపోయిందని.. దానిని పట్టుకుని ఏడుస్తున్న మరో కోలా.. వీడియో వైరల్